చేతిని కోల్పోయిన కార్మికుడికి Dh150,000 పరిహారం
- January 19, 2023
అబుధాబి: పనిచేస్తున్న క్రమంలో గ్రైండర్ ప్రమాదంలో గాయపడి, చెతిని కోల్పోయిన కార్మికుడికి Dh150,000 పరిహారం అందించాలని అబుధాబి అప్పీల్స్ కోర్టు అతను పనిచేస్తున్నా కంపెనీని ఆదేశించింది.అతను అనుభవించిన భౌతిక, భౌతిక నష్టాలకు పరిహారంగా అతనికి ఆ మొత్తాన్ని చెల్లించాలని కంపెనీ యజమానిని ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు తగిన భద్రత, రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే తాను ప్రమాదానికి గురైనట్లు, ఆ ప్రమాదంలో తన చేతిని కోల్పోయినట్లు అందుకు 200,000 దిర్హామ్ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేశాడు. పిటిషన్ ను విచారించిన అబుధాబి క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కంపెనీని దోషిగా నిర్ధారించింది, 10,000 దిర్హామ్ జరిమానా చెల్లించాలని ఆదేశించింది.సంస్థ కార్మికుడికి Dh100,000 పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.అయితే తన వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికుడు అప్పీల్ కోర్టులో తీర్పును సవాలు చేశాడు. ప్రమాదం కారణంగా చేయి పోగొట్టుకున్న తాను ఇకపై కొన్ని విధులు నిర్వహించలేనని ఉద్ఘాటించారు.అన్ని పక్షాల నుండి విన్న తర్వాత అప్పీల్ కోర్టు న్యాయమూర్తి పరిహారాన్ని Dh150,000కి పెంచారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







