నిబంధనలు పాటించని పాదచారులకు 400 దిర్హామ్‌ల జరిమానా

- January 20, 2023 , by Maagulf
నిబంధనలు పాటించని పాదచారులకు 400 దిర్హామ్‌ల జరిమానా

యూఏఈ: హిట్ అండ్ రన్ ప్రమాదాలను నివారించడానికి వీధుల్లో పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేస్తున్నట్లు ఫుజైరా పోలీసులు వెల్లడించారు. 'భద్రంగా రోడ్డను దాటే హక్కు నాకు ఉంది' అనే పేరుతో ట్రాఫిక్ భద్రతా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. పాదచారుల భద్రతను పరిరక్షించడం, మరణాలు, గాయాల శాతాన్ని తగ్గించడంతోపాటు, రోడ్లను సురక్షితంగా మార్చడం, సమాజంలోని అన్ని వర్గాలలో ట్రాఫిక్ అవగాహనను పెంపొందించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్, పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ కల్నల్ సలేహ్ ముహమ్మద్ అబ్దుల్లా అల్-ధన్హానీ తెలిపారు. మార్కెట్లు, నివాస ప్రాంతాలు, పాఠశాలలకు సమీపంలోని రోడ్లు వంటి రద్దీగా ఉండే ప్రాంతాలలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితులపై శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించని పాదచారులకు Dh400 జరిమానా విధించబడుతుందని పేర్కొన్నారు. అలాగే నిర్దేశిత క్రాసింగ్‌లలో పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వని వాహనదారులకు Dh500 జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు విధించే అవకాశం ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com