38 ఏళ్ల తర్వాత గల్ఫ్ కప్ ఛాంపియన్ గా ఇరాక్

- January 20, 2023 , by Maagulf
38 ఏళ్ల తర్వాత గల్ఫ్ కప్ ఛాంపియన్ గా ఇరాక్

మస్కట్: బస్రా ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన 25వ అరేబియా గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్లో ఇరాక్ 3-2తో ఒమన్‌పై విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత ఇరాక్ గల్ఫ్ టైటిల్ చేజిక్కుంచుకున్నది. చివరిసారిగా 1988లో సౌదీ అరేబియాలో ఇరాక్ గల్ఫ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇరాక్ తరఫున ఇబ్రహీం బయేష్ 24వ నిమిషంలో, 116వ నిమిషంలో అమ్జాద్ అత్వాన్ పెనాల్టీని గోల్ గా మలిచాడు. మనఫ్ యూనిస్ 120వ నిమిషంలో గోల్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఒమన్ తరఫున సలాహ్ అల్ యాహాయి 90వ నిమిషంలో పెనాల్టీని గోల్ గా మలిచాడు. 119వ నిమిషంలో ఒమర్ అల్ మాలికీ గోల్ చేశాడు.  అంతకుముందు  స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నంలో స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం నలుగురు మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డట్లు స్థానికి మీడియా తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com