బోటు ప్రమాదంలో 145 మంది మృతి
- January 20, 2023
కాంగో: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మృతి చెందారు. మరో 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులు తమ సరుకులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా బసంకుసు పట్టణ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బోటులో ప్రయాణికులు, వస్తువులు, జంతువులతో నిండిపోవడంతో బోటు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ పడవ ప్రమాదాలు జరగడం కామన్అయిపోయింది. ఇక్కడ రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడవల్లో నిత్యం ప్రయాణిస్తుంటారు. వలసలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతోంది. గతేడాది అక్టోబర్లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







