హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్విక్‌జెట్ ఫ్రైటర్ సర్వీసులు ప్రారంభం

- January 21, 2023 , by Maagulf
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్విక్‌జెట్ ఫ్రైటర్ సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్: క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్ ఇటీవల GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తన తొలి ఫ్రైటర్ సర్వీస్‌ను ప్రారంభించింది. క్విక్‌జెట్ హైదరాబాద్‌లో ఉన్న బోయింగ్ 737-800ఎఫ్ ఫ్రైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఢిల్లీ మరియు బెంగళూరుకు రోజువారీ ఫ్రైటర్ సేవలను అందిస్తుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ మరియు బెంగుళూరులను కవర్ చేసే తన నెట్‌వర్క్ ప్రదేశాలకు ఈ ఫ్రైటర్, ఎయిర్ ఫ్రైట్ మరియు ఎక్స్‌ప్రెస్ కార్గోను తీసుకువెళుతుంది. 

క్విక్‌జెట్ ఫ్రైటర్ ప్రతిరోజూ 00.30 గంటలకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరుతుంది, బెంగళూరు నుండి 08.50 గంటలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటుంది. ప్రస్తుతం, క్విక్‌జెట్‌ వద్ద 22 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో B737-800F రెండు విమానాలు ఉన్నాయి, ఇవి రెండూ హైదరాబాద్‌ లో ఉన్నాయి. పెరిగిన కార్గో కనెక్టివిటీతో ఇ-కామర్స్‌ సరుకులు వేగంగా వినియోగదారులను చేరుకుని, వాణిజ్యానికి ఊతం లభిస్తుంది.

క్విక్‌జెట్ సేవల ప్రారంభంపై CEO-GHIAL ప్రదీప్ పణికర్, “క్విక్‌జెట్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది. మా విమానాశ్రయంలో మరొక కార్గో సర్వీస్ చేరడంపై సంతోషిస్తున్నాము. హైదరాబాద్ నుండి దక్షిణ భారతదేశానికి కార్గో కనెక్టివిటీని పెంచడానికి క్విక్‌జెట్ సేవలు ఉపయోగపడతాయి. మా విమానాశ్రయం నుండి క్విక్‌జెట్ సేవలు హైదరాబాద్‌లో పెరుగుతున్న కార్గో ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా నిరాటంటకమైన, వేగవంతమైన కార్గో సేవలను అందించడానికి ప్రపంచ స్థాయి సదుపాయాలను నిర్మిస్తోంది.’’ అన్నారు.

GMR హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కార్గో ఫార్మా, పెరిషబుల్స్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ ఉత్పత్తులు, పెద్ద యంత్రాలు, ప్రమాదకర మెటీరియల్స్ (HAZMAT), డేంజరస్ గూడ్స్ (DG)లను హ్యాండిల్ చేస్తుంది. భారతదేశంలోని అన్ని ప్రధాన కార్గో హబ్‌లతో పాటు, ఫ్రాంక్‌ఫర్ట్, ఇస్తాంబుల్, దుబాయ్, దోహా, హాంకాంగ్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలు కూడా హైదరాబాద్ విమానాశ్రయానికి బాగా అనుసంధానించబడ్డాయి. 

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కార్గో టెర్మినల్‌లో ఉష్ణోగ్రత-నియంత్రిత ఫార్మా సరుకులను నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన ఆధునిక, ప్రపంచ-స్థాయి ఎయిర్ కార్గో టెర్మినల్ ఉంది. అధునాతన భద్రతా స్క్రీనింగ్ మరియు కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్‌లతో సహా అన్ని సపోర్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు పరికరాలు ఇక్కడున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com