సాయి పల్లవి ఆ హీరోకి ఓకే చెబుతుందా.?
- January 21, 2023
‘భానుమతి.. సింగిల్ పీస్, హైబ్రీడ్ పిల్ల..’ అంటూ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన మలర్ బ్యూటీ సాయి పల్లవి. గ్లామర్‌కి దూరంగా యాక్టింగ్‌కి మాత్రమే స్కోపున్న సినిమాల్ని ఎంచుకుంటుంటుంది.
వచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడేసుకోదు సాయి పల్లవి. తన పాత్రతో పాటూ, కథలో కూడా విషయం వుంటేనే ఆ సినిమా ఒప్పుకుంటుంది. తాజాగా అజిత్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే ‘తుళివు’ తెలుగులో ‘తెగింపు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అజిత్, తాజా చిత్రం కోసం హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. ఆ క్రమంలో పలువురు స్టార్ హీరోయిన్ల కోసం వేట కొనసాగగా, ఆ లిస్టులో సాయి పల్లవి పేరు చేరిందనీ వినికిడి.
అయితే, అజిత్ సినిమాల్లో హీరోయిన్లకి ప్రాధాన్యత ఎక్కువగా వుండకపోవచ్చు. అంతేకాదు, అజిత్ వంటి స్టార్ హీరో సరసన సాయి పల్లవి సూట్ అవుతుందా.? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. అయితే, సాయి పల్లవి మెచ్చూర్డ్ యాక్ర్రెస్. ఏమో ఆమెకి సాధ్యం కానిదేదీ లేదు. పాత్ర నచ్చితే, ఓకే చేసినా చేస్తుంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







