ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేస్తే SR5,000 జరిమానా

- January 22, 2023 , by Maagulf
ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేస్తే SR5,000 జరిమానా

జెడ్డా : జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KAIA) అరైవల్ హాల్స్ ద్వారా ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించే వారిని హెచ్చరించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే SR5,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. యాత్రికులను టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ సేవలను పొందేందుకు యాత్రికులు ఇహ్రామ్ ధరించాలని, పౌరులు తప్పనిసరిగా వారి జాతీయ IDని చూపాలని, నివాసితులు తమ నివాసాన్ని (ఇకామా) చూపించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com