దుబాయ్ ‘అల్ట్రా-లగ్జరీ అట్లాంటిస్’ను సందర్శించిన షేక్ మొహమ్మద్
- January 22, 2023
యూఏఈ: ఎమిరేట్‌లోని పామ్ జుమేరా ద్వీపంలోని కొత్త ఐకానిక్ ల్యాండ్‌మార్క్ ‘అల్ట్రా-లగ్జరీ అట్లాంటిస్’ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ సందర్శించారు. "మన పర్యాటక రంగానికి కొత్త ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్- అట్లాంటిస్ ది రాయల్ హోటల్" అని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 10 సంవత్సరాలలో దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో ప్రైవేట్ రంగం కీలక భాగస్వామిగా కొనసాగుతుందన్నారు. "యూఏఈ, దుబాయ్ అంతర్జాతీయ పర్యాటకులకు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానంగా మారేందుకు ప్రైవేట్ రంగంతో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము." అని షేక్ మహమ్మద్ అన్నారు.
ప్రపంచంలోని ప్రముఖ డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, కళాకారులచే రూపొందించబడిన అట్లాంటిస్ ది రాయల్ 500 మీటర్ల పొడవు, 178 మీటర్ల పొడవైన మెగా నిర్మాణం. ఈ రిసార్ట్‌లో 90x33-మీటర్ల స్కై బ్రిడ్జ్‌లతో అనుసంధానించబడిన ఆరు టవర్లు ఉన్నాయి. ఇందులో 795 గదులు, సూట్లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. రిసార్ట్‌లో ప్రత్యేకమైన స్కై గార్డెన్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







