స్టాక్‌హోమ్‌ ఘటనపై సౌదీ అరేబియా తీవ్ర నిరసన

- January 22, 2023 , by Maagulf
స్టాక్‌హోమ్‌ ఘటనపై సౌదీ అరేబియా తీవ్ర నిరసన

రియాద్ : స్వీడన్ లోని స్టాక్‌హోమ్‌లోని టర్కీ రాయబార కార్యాలయం ముందు పవిత్ర ఖురాన్ ప్రతులను తగలబెట్టడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వీడన్ కు నిరసన తెలియజేసింది. ఇలాంటి చర్యలు ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సహనం, సహజీవనం విలువలకు ఇది భంగం కలిగిస్తుందని తన నిరసన ప్రకటనలో సౌదీ విదేశాంగ శాఖ పేర్కొంది.

మరోవైపు ఈ ఘటనపై టర్కీ తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావుసోగ్లు అంకారాలోని స్వీడిష్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. స్టాక్‌హోమ్‌లో నిరసనలకు అనుమతిని ఇచ్చిన స్వీడిష్ అధికారుల చర్యకు ప్రతిస్పందనగా జనవరి 27న జరగాల్సిన స్వీడిష్ రక్షణ మంత్రి పాల్ జాన్సన్ అంకారా పర్యటనను రద్దు చేస్తున్నట్లు టర్కీ ప్రకటించింది.

ఇదిలా ఉండగా.. స్టాక్‌హోమ్‌లోని టర్కీ రాయబార కార్యాలయం దగ్గర డానిష్ పార్టీ నాయకుడు స్ట్రామ్ కుర్స్ (హార్డ్ లైన్) రాస్మస్ పలుదాన్‌ నిరసన తెలిపేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని స్టాక్‌హోమ్ పోలీసు విభాగం ప్రకటించింది. కానీ అనుహ్యంగా పలుదాన్‌  స్టాక్‌హోమ్‌లోని టర్కిష్ రాయబార కార్యాలయ భవనం బయట పవిత్రమైన ఖురాన్ ప్రతులను తగులబెట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com