కువైట్ లో పొగమంచు.. నిలిచిన విమాన రాకపోకలు

- January 22, 2023 , by Maagulf
కువైట్ లో పొగమంచు.. నిలిచిన విమాన రాకపోకలు

కువైట్: కువైట్ వ్యాప్తంగా క్షితిజ సమాంతర దృశ్యమానత(హరిజెంటల్ విజిబిలిటీ) ఒక కిలోమీటరు కంటే తక్కువకు పడిపోయింది. దీంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 6:50 మరియు 8:50 గంటల మధ్య వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల విమాన రాకపోకలు నిలిచిపోయాయని DGCA వాతావరణ సూచనల విభాగం అధిపతి అమీరా అల్-అజెమీ తెలిపారు. కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ భారీగా తగ్గిందన్నారు. మరోవైపు తేమతో రహదారులు తడిగా ఉంటాయని, విజిబిలిటీ తక్కువగా ఉన్నందునా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని డీజీసీఏ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com