యూఏఈలో 4-రోజుల ఈద్ అల్ ఫితర్ సెలవులు
- January 23, 2023
యూఏఈ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈలో వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. దీంతో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. యూఏఈ నుండి భారతదేశం, పాకిస్తాన్, జీసీసీ, ఇతర మధ్యప్రాచ్య దేశాలకు విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. లాంగ్ వీకెండ్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తుండటంతో ఈద్ అల్ ఫితర్ రోజుల్లో ఛార్జీల ధర 150 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల, యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు ఎంత ముందుగా సీట్లు బుక్ చేసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు. ప్రత్యేకించి పెద్ద కుటుంబాలకు ముందుగా సీట్లు బుక్ చేసుకోవడం ద్వారా మంచి మొత్తంలో ఆదా అవుతుందని తెలిపారు. ఈద్ అల్ ఫితర్‌కు వారం ముందు సీటు పొందడం యూఏఈ నుండి వచ్చే ప్రయాణికులకు సవాలుగా మారింది. భారత ఉపఖండం రూట్లలో కేరళ, లక్నో, ఢిల్లీ, ఢాకా, కొలంబో, కరాచీ, లాహోర్, ముంబైలకు వెళ్లే విమానాలకు ఫుల్ డిమాండ్ ఉన్నదని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ అద్నానీ తెలిపారు. ముఖ్యంగా ఈద్ పండుగల సమయంలో దాదాపు అన్ని ముస్లిం దేశాలకు విమాన ఛార్జీలు పెరుగుతాయని అద్నానీ పేర్కొన్నారు. యూఏఈలో అధికారిక ఈద్ అల్ ఫితర్ సెలవులు రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు (హిజ్రీ ఇస్లామిక్ క్యాలెండర్ నెలలు) అంటే ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 23 వరకు ఉన్నాయి.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







