ఆత్మహత్య చేసుకున్న యంగ్ హీరో
- January 23, 2023
హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధీర్ వర్మ బలవన్మరణ విషయాన్ని ఆయన సహ-నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు. ఆయనతో కలిసి సుధీర్ వర్మ ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించారు. ఈ సినిమాతో సుధీర్ వర్మ మంచి పేరును సంపాదించుకున్నాడు.
తెలుగులో ‘కుందనపు బొమ్మ’, ‘సెకండ్ హ్యాండ్’, ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ వంటి సినిమాల్లో సుధీర్ వర్మ నటించాడు. అయితే ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల వైజాగ్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న నిజాన్ని తాను నమ్మలేకపోతున్నానని.. తనతో మంచి స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటుడు సుధాకర్ కోమాకుల తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
సుధీర్ వర్మ ఆత్మహత్య గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.ఇలా ఓ యంగ్ హీరో ఆత్మహత్యకు పాల్పడటంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







