దుబాయ్ లో వీసా స్టాంపులకు గుడ్ బై.. ఎమిరేట్స్ ID ఉంటే చాలు

- January 23, 2023 , by Maagulf
దుబాయ్ లో వీసా స్టాంపులకు గుడ్ బై.. ఎమిరేట్స్ ID ఉంటే చాలు

దుబాయ్: దుబాయ్ లో ఇకపై స్టాంపింగ్ ప్రక్రియను రద్దు చేయనున్నారు. దుబాయ్ నివాసితులు తమ వద్ద ఉన్న ఎమిరేట్స్ ఐడీలతో నేరుగా జీసీసీ దేశాల్లో విమానయానం చేయవచ్చు. యూఏఈ వీసా నేరుగా వ్యక్తి ఎమిరేట్స్ IDకి లింక్ చేయబడుతుంది. ఇది నివాసం, దాని చెల్లుబాటును వివరిస్తుంది. దీంతో వీసా స్టిక్కర్‌ కోసం పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిఫై, సిటిజన్‌షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ (ICP) గతంలో మే 2022లో నివాసం, గుర్తింపు కార్డు దరఖాస్తులను విలీనం చేయాలని ఐసీపీ నిర్ణయించింది. అయితే, ఈ మార్పులు మొదట మే 16, 2022 నుండి దుబాయ్‌లో మినహా ఇతర ఎమిరేట్స్‌లో అమలులోకి వచ్చాయి. తాజాగా వీటిని దుబాయ్ లోనూ అనుమతి ఇవ్వనున్నారు. విమానయాన సంస్థలు వారి ఎమిరేట్స్ ID, పాస్‌పోర్ట్ నంబర్‌ను ఉపయోగించి ఒక వ్యక్తి యూఏఈ నివాసాన్ని ధృవీకరించగలవని తెలిపింది. ధృవీకరణ కోసం ఎయిర్‌లైన్స్ పాస్‌పోర్ట్ రీడర్‌ను ఉపయోగించవచ్చని సూచించింది. ఈ మార్పులకు ముందు, ఎవరైనా కొత్త నివాస వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా లేదా వీసా పునరుద్ధరణ కోసం వెళ్లే వారైనా వీసాతో స్టాంప్‌ను పొందేందుకు వారి పాస్‌పోర్ట్‌లను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యక్తులు తమ ఎమిరేట్స్ IDని డిజిటల్‌గా వీక్షించడానికి అధికారిక ICP వెబ్‌సైట్ లేదా UAEICP స్మార్ట్ యాప్‌ని ఉపయోగించవచ్చని కూడా అథారిటీ తెలిపింది. యూఏఈ నివాసితులకు జారీ చేయబడిన కొత్త తరం ఎమిరేట్స్ ID కార్డ్‌లు రెసిడెన్సీ స్టిక్కర్‌తో సమానంగా అన్ని వివరాలను కలిగి ఉంటాయని పేర్కొంది. ఇందులో వ్యక్తిగత, వృత్తిపరమైన డేటా వివరాలు కూడా ఉంటాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com