296 మంది ఎమిరాటీలను మోసం చేసిన ప్రైవేట్ సంస్థ యజమానికి జైలుశిక్ష
- January 25, 2023
యూఏఈ: 296 ఎమిరాటీలను మోసం చేసినందుకు ఒక ప్రైవేట్ కంపెనీ యజమాని, మేనేజర్‌కు జైలుశిక్ష విధిస్తూ యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నఫీస్ పథకంలో భాగంగా ట్రైనీలుగా చేరిన ఎమిరాటీస్ నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో నిందితులకు జైలుశిక్ష పడింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందుతులకు చెందిన సంస్థ ఎమిరాటీలకు శిక్షణ ఇవ్వడానికి నఫీస్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకుంది. వారు ట్రైనీలను "దాతృత్వ ప్రయోజనాల కోసం" బ్యాంక్ ఖాతాలో కొంత మొత్తాన్ని జమ చేయాలని కోరారు. వారు నిరాకరించినట్లయితే శిక్షణ మూల్యాంకనంలో 'విఫలం' చేస్తామని సంస్థ ట్రైనీలను బెదిరించింది. నఫీస్ పథకం అనేది ఎమిరాటీస్ పోటీతత్వాన్ని పెంచడానికి, దేశంలోని ప్రైవేట్ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను పొందడానికి ఉద్దేశించినది. ప్రైవేట్ రంగ కంపెనీలు నఫీస్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎమిరాటీ ఉద్యోగార్ధుల కోసం ఖాళీలు, శిక్షణను అందించవచ్చు. దీనికి గాను మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. గత సంవత్సరం ఎమిరేటైజేషన్ విధానాలను ఉల్లంఘించినందుకు 20 సంస్థలను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సూచించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







