శ్రీలీల విషయంలో రవితేజ జోస్యం ఫలిస్తుందా.?
- January 25, 2023 
            ‘ధమాకా’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ మీదున్న చలాకీ పిల్ల శ్రీ లీల. ‘ధమాకా’ హిట్‌తో శ్రీ లీల పేరు మీడియాలో మోత మోగిపోతోంది.
అంతేకాదు, చేతి నిండా ప్రాజెక్టులతో శ్రీలీల డైరీ కళకళలాడిపోతోంది కూడా. ఈ సినిమా తర్వాత బాలయ్యతో ఓ సినిమాలో నటిస్తోంది శ్రీలీల.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తోంది. అలాగే, యంగ్ హీరో రామ్ పోతినేనితో ఇంకో సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది.
దీంతో పాటూ, మెగా కాంపౌండ్ హీరోల దృష్టి కూడా శ్రీలీలపై పడినట్లు తాజా సమాచారం. ఒకవేళ అదే జరిగితే, శ్రీలీల టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.
‘ధమాకా’ టైమ్‌లోనే శ్రీలీల భవిష్యత్తు చెప్పేశాడు మాస్ రాజా రవితేజ. తర్వాత ఇంకో సినిమాకి నాతో చేసేంత టైమ్ వుంటుందో లేదో శ్రీలీలకు.. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉన్నాయి శ్రీలీలకు అన్నాడు మాస్ రాజా రవితేజ. ఏమో అది నిజమవుతుందేమో.!
తాజా వార్తలు
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!







