గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించాల్సిందే - తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- January 25, 2023
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం రేపు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది. మరోవైపు, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏ మాత్రం స్పందించలేదు. అసలు వేడుకలను నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయంలో సైతం సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను ఎక్కడ నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







