బహ్రెయిన్ లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాప్

- January 25, 2023 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాప్

బహ్రెయిన్ : మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (MISTI) వర్క్ షాప్ ని రిఫ్ఫా వ్యూస్ ఇంటర్నేషనల్ స్కూల్ (RVIS)  తన ఇన్నోవేషన్ సెంటర్ LEVEL 5లో నిర్వహించింది. ఈ వర్క్‌షాప్ న యూఎస్ ఎంబసీతో సహ-స్పాన్సర్ చేసింది. ఇలా ఓ కార్యక్రమానికి యూఎస్ స్పాన్స్ ర్ చేయడం GCCలో ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని ముగ్గురు గ్రాడ్యుయేట్ MIT బహ్రెయిన్ విద్యార్థులు మార్వా అల్ అలావి (MIT మెకానికల్ ఇంజనీరింగ్, PhD), మరియం అల్ జోమైరీ (హార్వర్డ్ - ఫుల్‌బ్రైట్ పూర్వ విద్యార్థి, డాక్టోరల్ అభ్యర్థి), లతీఫా అల్ ఖయాత్ (MIT ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థి) ప్రారంభించారు. MITతో బహ్రెయిన్ విద్యాసంస్థలు, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య సాంస్కృతిక, శాస్త్రీయ మార్పిడిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు ప్రకటించారు. నలుగురు MIT బోధకుల మార్గదర్శకత్వంలో LEVEL 5 మేనేజర్ జాహి వెహ్బే పర్యవేక్షణతో RVIS నుండి 20 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు, బహ్రెయిన్‌లోని మరో మూడు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విస్తృత- 3D డిజిటల్ మోడలింగ్, 3D ప్రింటర్లు, లేజర్ ఎన్‌గ్రేవర్‌ల వంటి ప్రత్యేకమైన ఫాబ్రికేషన్ సాధనాలను ఉపయోగించి వేగవంతమైన ప్రోటోటైపింగ్‌తో సహా అవసరమైన ఫీల్డ్ సంబంధిత నైపుణ్యాలను స్టూడెంట్స్ ప్రదర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com