రియాద్‌లో 4మీలియన్ల యాంఫేటమిన్ మాత్రలు స్వాధీనం
- January 26, 2023
రియాద్ : ఖతార్‌లోని తమ సహచరుల సహకారంతో రియాద్‌లో 4.091.250 యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జీడీఎన్సీ) ప్రతినిధి ముహమ్మద్ అల్-నుజైదీ తెలిపారు. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్స్‌లోని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) కూడా తమకు సహకారం అందించిందన్నారు. యువత భద్రతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్, ప్రమోషన్ నెట్‌వర్క్‌లకు దృష్టి సారించడంతో భారీ మొత్తంలో యాంఫేటమిన్ మాత్రల రాకెట్ బయట పడిందన్నారు. పశువుల దాణాలో యాంఫెటమైన్ మాత్రలు దాచి తరలిస్తున్న తమ తనిఖీలో గుర్తించినట్లు వివరించారు. రియాద్‌లో మాత్రల పార్సిళ్లను అందుకున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఒక ఈజిప్షియన్, మరొకరు జోర్డాన్ అని తేలిందన్నారు. నిందితులపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయని, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







