ఉద్యోగుల భద్రతపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు

- January 26, 2023 , by Maagulf
ఉద్యోగుల భద్రతపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు

యూఏఈ: దేశంలో అస్థిర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల భద్రతపై యూఏఈ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) కీలక సూచనలు చేసింది. వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని ప్రైవేట్ రంగ సంస్థలకు పిలుపునిచ్చింది. ప్రమాదాలను తగ్గించడంతోపాటు వృత్తిపరమైన వ్యాధులు, గాయాలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ కంపెనీలకు పిలుపునిచ్చింది. ఉద్యోగులకు అత్యవసర వాతావరణ పరిస్థితుల సమయంలో సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం, భద్రతా అవసరాలపై అవగాహన పెంచడం అవసరం అని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఏడు ఎమిరేట్స్‌లో బుధవారం భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ళు కురిశాయి. అస్థిర వాతావరణం గురువారం కూడా కొనసాగుతుందని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com