కువైట్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
- January 27, 2023
కువైట్: భారతదేశ 74వ గణతంత్ర వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. భారత రాయబార కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించారు. భారత రాయబారి హెచ్ఈ ఆదర్శ్ స్వైక కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాలులర్పించారు. ఈ సందర్భంగా భారత్ – కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ఆయన గుర్తు చేశారు. కువైట్‌లోని భారతీయులకు ఎంబసీ సహాయ సహకారాలు అందిస్తుందన్న ఆయన.. సహాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గుజరాతీ సమర్పన్, రైధున్ గ్రూప్, రిథమ్ స్కేప్, పంజాబీ బాంగ్రా గ్రూప్, బోహ్రా కమ్యూనిటీకి చెందిన ముహమ్మదీ స్కౌట్, కువైట్‌లోని స్కూల్ విద్యార్థులు, సాంస్కృతిక బృందాలు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







