వరదలలో మునిగిన కారు నష్టాలకు బీమాను క్లెయిమ్ చేయవచ్చా?

- January 27, 2023 , by Maagulf
వరదలలో మునిగిన కారు నష్టాలకు బీమాను క్లెయిమ్ చేయవచ్చా?

యూఏఈ: యూఏఈలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వాహనాలు మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇంజన్ సహా వాహనాలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనాలకు బీమాను క్లెయిమ్ చేయవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, భారీ వర్షాల సమయంలో నీట మునిగే ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పార్క్ చేసిన వాహనాలకు బీమా పాలసీలు ఇంజిన్‌కు కలిగే నష్టాలను కవర్ చేయకపోవచ్చని చెబుతున్నారు. యూనిట్‌ట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొయిన్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. వాహనదారుడు వర్షం తర్వాత వాహనం పూర్తిగా లేదా పాక్షికంగా మునిగిపోయినట్లు గుర్తించినట్లయితే, వాహనం దాని ఇంజిన్‌కు నష్టం వాటిల్లితే బీమా క్లెయిమ్ దాఖలు చేయవచ్చని తెలిపారు. అయితే, యజమాని అతని/ఆమె కారును నీట మునిగే ప్రదేశంలో పార్క్ చేసి, వాహనం పూర్తిగా లేదా పాక్షికంగా వర్షపు నీటిలో మునిగి, వాహనం ఇంజిన్ దెబ్బతింటే వాహనదారుడు బీమా కంపెనీ నుండి క్లెయిమ్ పొందలేడని ఆయన తెలిపారు. పాలసీబజార్ యూఏఈ సీఈఓ నీరజ్ గుప్తా మాట్లాడుతూ.. డ్రైవర్లు తమ బీమా కవరేజీని బాగా చదవాలని, రోడ్లపై జాగ్రత్తగా నడపాలని సూచించారు. నీట మునిగిన ప్రదేశాల్లో లేదా వరదల గుండా నడపడం కారణంగా జరిగిన నష్టాలకు చాలా బీమా సంస్థలు కవర్ చేయవని, ముఖ్యంగా ఇంజిన్ డ్యామేజ్ లకు క్లెయిమ్ వర్తించదని ఆయన తెలిపారు. వరదల్లో కారు చిక్కుకున్న సమయంలో కారు దెబ్బతినకుండా ఉండేందుకు కారును రోడ్డు పక్కన ఎత్తైన ప్రదేశంలో పార్క్ చేయడం మంచిదని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com