ఐఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 74వ భారత గణతంత్ర వేడుకలు

- January 27, 2023 , by Maagulf
ఐఎల్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 74వ భారత గణతంత్ర వేడుకలు

బహ్రెయిన్: దాదాపు రెండేళ్ల అనంతరం 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని బహ్రెయిన్ లోని ఇండియన్ లేడీస్ అసోసియేషన్(ILA) ఘనంగా జరుపుకుంది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తితో కూడిన లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహించారు. సీఫ్‌లోని రామీ గ్రాండ్ హోటల్‌లో వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా క్విజ్‌లు, ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు ది ఇండియన్ లేడీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధీర్ పాసి తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అతిపురాతనమైన లాభాపేక్షలేని సంస్థలలో ఐఎల్ఏ ఒకటి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి అనేక ప్రాజెక్ట్‌లలో ఈ సంస్థ పని చేస్తుంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com