‘మెంటల్’ రచ్చ.! తగ్గేదేలే అంటోన్న బాలయ్య.!
- January 27, 2023
అక్కినేని తొక్కినేని.. ఆ రంగారావు.. ఈ రంగారావు.. అంటూ ‘వీర సింహారెడ్డి’ సినిమా విజయోత్సవ సభ సందర్భంగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం నుంచి, నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు చురకలు అంటించిన సంగతీ తెలిసిందే. సినీ రంగం నుంచే కాదు, రాజకీయంగానూ బాలయ్య వ్యాఖ్యలు హీట్ పెంచేశాయ్.
లెజెండరీ నటుల్ని అగౌరవపరిచేలా మాట్లాడతారా.? బాలయ్య క్షమాపణలు చెప్పాల్సిందే.. అంటూ పలు రకాలుగా బాలయ్యపై నెగిటివిటీ పోటెత్తింది. ఈ తరుణంలో బాలయ్య స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే తనకెంతో అభిమానమనీ, చాలా ఆప్యాయంగా మాట్లాడేవారనీ, తన పిల్లల కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవారనీ ఎందుకంటే అక్కడ (అక్కినేని కుటుంబం) అభిమానం లేదు.. ఇక్కడ వుంది.. అని వివాదాన్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లారు బాలయ్య.
దీంతో, నాగార్జునపై ఒత్తిడి పెరుగుతోంది. బాలయ్య నోటికి అడ్డుకట్ట పడాలంటే, నాగార్జున స్పందించాల్సిందే అంటూ అక్కినేని అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. చూడాలి మరి, ఈ రచ్చ ఎంత దూరం పోతుందో.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







