'సైలెంట్ కిల్లర్' కార్బన్ మోనాక్సైడ్.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- January 29, 2023
దుబాయ్: అనుకోకుండా పీల్చే వ్యక్తులను చంపే కార్బన్ మోనాక్సైడ్ (CO) అనే వాయువు పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు నివాసితులను హెచ్చరించారు. దీనిని 'నిశ్శబ్ద కిల్లర్'గా పేర్కొంటూ.. దుబాయ్ పోలీసులు CO రంగు, వాసన లేని కారణంగా గుర్తించడం కష్టమని వీడియో ప్రకటన ద్వారా నివాసితులకు జాగ్రత్తలు తెలిపారు. కార్లు లేదా ట్రక్కులు, చిన్న ఇంజన్లు, స్టవ్‌లు, లాంతర్లు, గ్రిల్స్, నిప్పు గూళ్లు, గ్యాస్ రేంజ్‌లు లేదా ఫర్నేస్‌లలో ఇంధనాన్ని కాల్చడం ద్వారా ఉత్పత్తి అయ్యే పొగల్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందన్నారు. దీన్ని ఇంటి లోపల పీల్చే వ్యక్తులకు హానీ చేస్తుందని, ముఖ్యంగా ప్రజలు గది లోపల లేదా వాహనాలలో మూసి ఉన్న ప్రదేశాలలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. కార్బన్ మోనాక్సైడ్ శరీరంలో ఎక్కువైతే అత్యంత సాధారణ లక్షణాలు తలనొప్పి, మైకం, బలహీనత, కడుపు నొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి లక్షణాలు కనిపిస్తాయని, కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితికి చేరుకుంటారని హెచ్చరించారు. మూసివేయబడిన ప్రదేశాలలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, స్థానికంగా ధృవీకరించబడిన కూలింగ్/హీటింగ్ ఉపకరణాలను ఉపయోగించాలని దుబాయ్ పోలీసులు నివాసితులను కోరారు. నివాసితుల భద్రత కోసం ఇళ్ల వద్ద CO అలారంను అమర్చాలని నివాసితులకు సూచించారు. మూసి ఉన్న ప్రదేశాల్లో ఎసెన్స్ లేదా కోల్ బర్నర్లను ఎప్పుడూ ఉపయోగించవద్దని పోలీసులు తెలిపారు. గ్యారేజీలో లేదా ఇతర మూసివున్న నిర్మాణంలో పడిఉన్న వాహనంలో ఎక్కువ కాలం ఉండకూడదని వాహనదారులను హెచ్చరించారు. 2020లో ఇద్దరు గృహ కార్మికులు గదిని వేడి చేయడానికి రాత్రిపూట బొగ్గును కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ను అధిక మోతాదులో పీల్చడం వల్ల మరణించారని గుర్తు చేశారు. మరొక సంఘటనలో విల్లాలో ఎలక్ట్రిక్ జనరేటర్ నుండి లీక్ అయిన CO గ్యాస్‌ను పీల్చడం వల్ల 2022లో ఒక ఆసియా మహిళ, ఆమె కుక్క బర్ దుబాయ్ ప్రాంతంలో మరణించారని తెలిపారు. ఇతర దేశాలలో ప్రజలు వాహనం ఇంజిన్, హీటర్‌ను ఆన్ చేసి నిద్రపోయే సందర్భాలు ఉన్నాయని, కానీ CO ఉద్గారాలు వాహనంలో ఉన్నవారి మరణానికి దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలో ప్రతి సంవత్సరం కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం కారణంగా దాదాపు 4,000 మందికి పైగా ఆసుపత్రి పాలవుతున్నారని, అందులో 400 మందికి పైగా మరణిస్తున్నారని దుబాయ్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







