ఫార్ములా E 2023 ఫైనల్‌కు హాజరైన క్రౌన్ ప్రిన్స్
- January 29, 2023
రియాద్ : సౌదీ చారిత్రాత్మక రాజధాని దిరియా నడిబొడ్డున శనివారం జరిగిన ఫార్ములా ఇ రేస్ 2023 ఫైనల్‌కు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ హాజరయ్యారు. క్రీడా మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఫైనల్‌కు ముందు సౌదీ జాతీయ గీతం ఆలపించారు. క్రౌన్ ప్రిన్స్ ఫార్ములా ఇ దిరియాలో పాల్గొన్న జనాలను, జట్ల సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. సౌదీ అరేబియాలో ఫార్ములా E జరగడం ఇది 5వ సారి కావడం గమనార్హం. ఈసారి మొత్తం 11 జట్లు తరఫున 22 మంది డ్రైవర్లు "CORE Diriyah E-Prix 2023" పేరుతో రేసులో పాల్గొంటున్నారు. ఫార్ములా E 2023 రేస్ 2.495 కి.మీ పొడవు, 21 మలుపులు కలిగిన సర్క్యూట్లో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







