2023లో మొదటి ఓపెన్ హౌస్‌ను నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం 2023లో మొదటి ఓపెన్ హౌస్‌ను శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ 40 మంది భారతీయ కమ్యూనిటీ సభ్యులను కలుసుకున్నారు.ఈ సందర్భంగా వారి అత్యవసర, సాధారణ కాన్సులర్, ఉద్యోగ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేత కార్యక్రమం, రిసెప్షన్లో భారతీయ కమ్యూనిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ICRF, వరల్డ్ NRI కౌన్సిల్, భారతి అసోసియేషన్, TKS, BKS, ఇండియన్ క్లబ్, బుదయ్య గురుద్వారా, TASCA అందించిన సహకారానికి రాయబారి కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీ, ICRF సంయుక్తంగా జైళ్లు, లేబర్ క్యాంపులలో వైద్య శిబిరాలను నిర్వహించాయని పేర్కొన్నారు. అలాగే తమకు మద్దుతుగా నిలిచిన లోకల్ గవర్నమెంట్ అథారిటీలకు ఈ సందర్భంగా అంబాసిడర్ పీయూష్ శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







