లాంఛనంగా ప్రారంభం కాబోతున్న నాని కొత్త సినిమా.!
- January 30, 2023నేచురల్ స్టార్ నాని వేగం పెంచాడు. ఆల్రెడీ ‘దసరా’ సినిమాని పూర్తి చేసేసిన నాని, గ్యాప్ తీసుకోకుండా కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేయనున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని కొత్త సినిమా షురూ అయ్యింది.
ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా రానున్నారనీ తెలుస్తోంది.
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానితో జత కడుతోంది. తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని వైరా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిస్తున్నారు. నాని డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. మొన్నా మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ