సందీప్ కిషన్ ఈ టైమ్‌లో అలా అనేశాడేంటీ.?
- January 30, 2023
యంగ్ హీరో సందీప్ కిషన్‌కి కాలం కలిసి రావడం లేదు. మంచి టాలెంట్ వున్న హీరో. కానీ, కలిసొస్తేనే కదా నిలదొక్కుకునేది. అయినా కొత్త ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు సందీప్ కిషన్.
ఆ మధ్య ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ఓ కొత్త ప్రయోగం చేశాడు ఒకింత ఫలించింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘మైఖేల్’ అనే సినిమాతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితర ప్రముఖ తమిళ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. డబ్బింగ్ సినిమా.. స్ట్రెయిట్ సినిమా అనే బేధాలు మన తెలుగు సినిమాకి లేవు.. ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు మన తెలుగు వాళ్లు.
కానీ, తమిళోళ్లు అలా కాదు.. డబ్బింగ్ సినిమాని డబ్బింగ్ సినిమాలాగే చూస్తారంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సినిమా ఫలితంపై ప్రభావం చూపించే ప్రమాదం వుంది కదా.. ఈ టైమ్‌లో సందీప్ కిషన్ ఎందుకిలా కెలుక్కున్నాడంటూ నెటిజన్లు వాపోతున్నారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







