రెసిడెన్సీ వీసాదారులకు శుభవార్త.. రీ-ఎంట్రీల దరఖాస్తుకు అనుమతి
- January 30, 2023
యూఏఈ: ఆరు నెలలకు పైగా ఎమిరేట్స్ వెలుపల ఉండే యూఏఈ రెసిడెన్సీ వీసా హోల్డర్లు ఇప్పుడు దేశంలోకి తిరిగి ప్రవేశించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, నివాసితులు ఎక్కువ కాలం దేశం వెలుపల ఉన్నందుకు కారణాన్ని తెలపాల్సి ఉంటుంది. అలాగే దానికి రుజువును అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను స్వీకరించినట్లు ట్రావెల్, టైపింగ్ సెంటర్ ఏజెంట్లు ధృవీకరించారు. నివాసితులు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెబ్సైట్లో ఈ సర్వీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ICP ఆమోదించిన ఇమెయిల్ పొందిన తర్వాత మాత్రమే దరఖాస్తుదారు దేశంలోకి తిరిగి ప్రవేశించగలరు. ఆమోదం ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు ఐదు పని దినాలు పడుతుంది. అల్ మాస్ బిజినెస్మెన్ సర్వీస్ జనరల్ మేనేజర్ అబ్దుల్ గఫూర్ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ధృవీకరించారు. కోవిడ్-19కి ముందు ఇన్ పర్సన్ సిస్టమ్ అమలులో ఉండేదని, కానీ ఇప్పుడు అది ఏకీకృతం చేయబడిందని, ఆన్లైన్లో అప్లై చేయవచ్చని ఆయన తెలిపారు. టి.పి. డీరా ట్రావెల్స్ జనరల్ మేనేజర్ సుధీష్ కూడా నోటిఫికేషన్ వచ్చినట్లు ధృవీకరించారు. నివాసులు అనుసరించాల్సిన ఆమోద ప్రక్రియ ICP ఇ-ఛానెల్స్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
రెసిడెన్సీ సాధారణంగా 180 రోజుల పాటు దేశం వెలుపల ఉన్నట్లయితే ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. కాగా, గోల్డెన్ వీసా హోల్డర్లు మాత్రం ఎంతకాలమైన విదేశాలలో ఉండే అవకాశం ఉంది. యూఏఈ అతిపెద్ద ఎంట్రీ, రెసిడెన్సీ వీసా సంస్కరణలు గత ఏడాది అక్టోబర్‌లో అమలులోకి వచ్చాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







