యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- January 31, 2023
యూఏఈ: యూఏఈలో రెసిడెన్సీ వీసా సంస్కరణలు అక్టోబర్ 2022 నుండి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుండి, అనేక మార్పులు అమలులోకి వచ్చాయి. ఇందులో దీర్ఘకాలిక గోల్డెన్ వీసా పథకంతో పాటు గ్రీన్ వీసాస్ అనే కొత్త ఐదేళ్ల రెసిడెన్సీ ఉన్నాయి. అలాగే వీసా సేవలకు రుసుము పెరుగుదల, వీసా గడువు ముగిసిన తర్వాత దేశం నుండి నిష్క్రమించడానికి పొడిగించిన గ్రేస్ పీరియడ్‌లతో సహా అనేక ఇతర మార్పులు ఇటీవల అమలు చేయబడ్డాయి. అందులో ముఖ్యమైన ఏడు రెసిడెన్సీ సంబంధిత మార్పులు మీ కోసం.
>> పిల్లల స్పాన్సర్ నియమాలు: ఈ సంస్కరణ కుటుంబాలకు భారీ ఉపశమనం కలిగించింది. అన్ని రెసిడెన్సీ రకాలకు ఇది వర్తిస్తుంది. నివాసితులు తమ కుమారులకు 25 ఏళ్లు వచ్చే వరకు స్పాన్సర్ చేయవచ్చు. అదే విధంగా 18 సంవత్సరాల వరకు పెళ్లికాని కుమార్తెలను స్పాన్సర్ చేయవచ్చు.
>> గోల్డెన్ వీసా - తల్లిదండ్రుల స్పాన్సర్: మీరు గోల్డెన్ వీసా హోల్డర్ అయితే, మీరు మీ తల్లిదండ్రులను 10 సంవత్సరాల వీసాలపై కూడా స్పాన్సర్ చేయవచ్చు. దీర్ఘకాలిక రెసిడెన్సీ స్కీమ్ లబ్ధిదారులు రెగ్యులర్ రెసిడెన్సీ హోల్డర్‌ల మాదిరిగానే ఒక సంవత్సరం పాటు తల్లిదండ్రులను స్పాన్సర్ చేయవచ్చు.
>> వీసా ఫీజులు పెంపు: గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) కోసం ఫెడరల్ అథారిటీ అందించే అన్ని సేవలను పొందేందుకు రుసుములు Dh100 మేరకు పెరిగాయి. అదనపు స్మార్ట్ సేవల రుసుములు ఎమిరేట్స్ ID, రెసిడెన్సీ వీసాలకు కూడా వర్తిస్తుంది.
>> ఫ్రీజోన్ వీసాల చెల్లుబాటు: యూఏఈలో జారీ చేసే ఫ్రీజోన్ వీసాల చెల్లుబాటును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు.
>> వీసా గడువు ముగిసిన తర్వాత గ్రేస్ పీరియడ్: రెసిడెన్సీ వీసా రద్దు తర్వాత UAE నుండి నిష్క్రమించడానికి గ్రేస్ పీరియడ్ ను చాలా సందర్భాలలో 60, 180 రోజుల మధ్య పెంచారు. ఇది గతంలో 30 రోజుల కంటే తక్కువగా ఉంది.
>> పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపుల స్థానంలో ఎమిరేట్స్ ID: పాస్‌పోర్ట్‌లపై రెసిడెన్సీ వీసా స్టిక్కర్‌లను స్టాంప్ చేసే విధానాన్ని UAE తొలగించింది. బదులుగా నివాసితుల ఎమిరేట్స్ IDలు అధికారికంగా వారి నివాస పత్రాలుగా పనిచేస్తాయి.
>> నివాసితులకు రీ-ఎంట్రీ పర్మిట్: UAE వెలుపల 6 నెలలకు పైగా ఉంటె గతంలో రెసిడెన్సీని రద్దు చేసేవారు. అయితే, ఇప్పుడు అలాంటి నివాసితులు దానికి కారణాన్ని పేర్కొనడం ద్వారా రీఎంట్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆమోదించబడినప్పుడు, దరఖాస్తుదారు ఆమోదం తేదీ నుండి 30 రోజులలోపు దేశంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!