మస్కట్ నైట్స్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం
- February 02, 2023
మస్కట్: మస్కట్ నైట్స్ వేదికలలో ఒకటైన ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో మంగళవారం సాయంత్రం ఎలక్ట్రిక్ గేమ్‌లలో ఒకటి కూలిపోవడానికి దారితీసిన లోపాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు ప్రారంభమైంది. డిపార్ట్మెంట్కు చెందిన బృందం బుధవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సీనియర్ అధికారి షబీబా రదియో తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు స్పష్టమైతే, ఒమానీ శిక్షాస్మృతి ప్రకారం బాధ్యులను శిక్షిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మందిని ఇప్పటికే ఆస్పత్రి నుంచి పంపించివేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా, మంగళవారం జరిగిన ప్రమాదం కారణంగా ఒమన్ సుల్తానేట్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ పిల్లల భద్రతను నిర్ధారించడానికి సంబంధిత అధికారులతో సమావేశమైంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ లైన్ 1100 ద్వారా నిపుణులతో కమ్యూనికేట్ చేయడం ద్వారా ఈవెంట్‌కు హాజరైన పిల్లలకు మానసిక సహాయాన్ని అందించాలని కమిటీ కోరింది. ఈ కమిటీకి సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని కుటుంబ అభివృద్ధికి డైరెక్టర్ జనరల్ సయ్యిదా మనీ బింట్ అబ్దుల్లా అల్ బుసైదీ అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!