ఫుడ్ పాయిజనింగ్: రెస్టారెంట్ మూసివేత
- February 03, 2023
యూఏఈ: ఫుడ్ పాయిజనింగ్‌పై పలువురు కస్టమర్‌లు ఫిర్యాదు చేయడంతో అబుధాబిలోని ఒక రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్నారు. ఆహార-పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ ను మూసివేశారు. అబుధాబిలోని బర్గర్ అల్ అరబ్ రెస్టారెంట్, కెఫెటేరియా సదుపాయాన్ని మూసివేయాలని అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ జారీ చేసింది. సాల్మొనెల్లా బాక్టీరియాతో కలుషితమైన గ్రిల్డ్ చికెన్ మీల్స్‌ను కస్టమర్‌లు తిన్న తర్వాత అనేక మంది కస్టమర్లు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఆహార నిల్వ, నిర్వహణ, తయారీలో సరైన పద్ధతులను అవుట్‌లెట్ పాటించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోగ్య అధికారులు నివేదిక సమర్పించారు. ఆహార తయారీ సమయంలో రెస్టారెంట్ పరిశుభ్రత పాటించడంలో విఫలమైందని, ఆహార నిల్వలు అధ్వాన్నంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నివాసితులు ఫుడ్ అవుట్‌లెట్‌లలో ఏవైనా ఉల్లంఘనలు జరిగినా లేదా ఆహార ఉత్పత్తుల విషయాలపై సందేహాలుంటే అబుధాబి ప్రభుత్వ టోల్-ఫ్రీ నంబర్ 800555కు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







