అన్ని రకాల యూఏఈ ప్రవేశ వీసాల చెల్లుబాటు.. మరో 60 రోజులు పొడిగింపు

- February 03, 2023 , by Maagulf
అన్ని రకాల యూఏఈ ప్రవేశ వీసాల చెల్లుబాటు.. మరో 60 రోజులు పొడిగింపు

యూఏఈ: సందర్శకులకు వారికి జారీ చేసిన అన్ని రకాల వీసాల చెల్లుబాటును 60 రోజుల పాటు పొడిగించినట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనాలిటీ, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తెలిపింది. అయితే, ఈ అవకాశం ఒకే సారికి మాత్రమే పరిమితమని పేర్కొంది. ఈ మేరకు తన స్మార్ట్ ఛానెల్‌ల ద్వారా కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది.  వీసా చెల్లుబాటును పొడిగించడానికి Dhs200, స్మార్ట్ సేవలకు Dhs100, అప్లికేషన్ ఫారమ్‌కు Dhs50, కస్టమర్‌లకు అందించే ఎలక్ట్రానిక్ సేవలకు Dhs50 రుసుములుగా నిర్ణయించినట్లు అథారిటీ తెలిపింది. దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ మూడు నెలల కంటే తక్కువ కాలం చెల్లుబాటు కాకుండా ఉండాలని, అతను/ఆమె యూఏఈలో ఉండకూడదని అప్పుడే ప్రవేశ అనుమతిని జారీ చేస్తారని ICP వెల్లడించింది. దరఖాస్తుదారులు తమ వీసాల చెల్లుబాటును ICP వెబ్‌సైట్, దాని స్మార్ట్ అప్లికేషన్ ద్వారా UAE PASS లేదా వినియోగదారు పేరు ద్వారా పొడిగించుకోవచ్చని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com