ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు..

- February 03, 2023 , by Maagulf
ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు..

హైదరాబాద్: కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు.గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ రెండు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.చికిత్స పొందుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు.ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రముఖులు మరియు అభిమానుల సందర్శనార్ధం కోసం కె.విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఉదయం ఆయన ఇంటి వద్దనే ఉంచగా, మధ్యాహ్నం నుండి ఆయన అంతిమయాత్ర మొదలయింది. పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. కె.విశ్వనాథ్ కుమారులు నాగేంద్ర నాథ్, రవీంద్ర నాథ్ హిందూ సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కళాతపస్వికి కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకున్నారు.

ఆయన ఇక లేరు అన్న వార్త సినీ పరిశ్రమని కలిచివేస్తుంది.కళనే కథగా చూపించాలనే కళాతపస్వి భావన.. తన సినిమాల్లో భారతీయ కళలకి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేసేలా చేసింది. నిజానికి చెప్పాలి అంటే రాజమౌళి కంటే ముందే తెలుగు సినిమా సత్తా చూపించిన దర్శకుడు కె.విశ్వనాథ్. తన సినిమాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సమయంలోనే తెలుగు చిత్రాన్ని నిలబెట్టారు. ఆయన సినిమాల్లో పాత్రధారులు కనిపించరు, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.విశ్వనాథ్ సినిమాల్లో నటిస్తే చాలు ఆ నటుడికి అవార్డు పక్కా. అందుకనే నటులు ఆయన సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారు, ఆ అవకాశాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఏదేమైన కె.విశ్వనాథ మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు అనే చెప్పాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com