'ప్రేమదేశం': మూవీ రివ్యూ

- February 03, 2023 , by Maagulf
\'ప్రేమదేశం\': మూవీ రివ్యూ

నటీనటులు:

మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు.

సాంకేతిక నిపుణులు

ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్
సినిమా : "ప్రేమదేశం "
విడుదల తేదీ  ఫిబ్రవరి 3, 2023
రివ్యూ రేటింగ్ : 3.5/5
నిర్మాత: శిరీష సిద్ధమ్
దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్
సంగీతం: మణిశర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : రఘు కళ్యాణ్ రెడ్డి, రాము
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : కమల్, కిరణ్, రూపా
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్


మాస్ మసాలా సినిమాలూ, థియేటర్లో గోల చేసే సినిమాలూ వచ్చి థియేటర్లలో ఎలా సందడి చేసాయో చూశాము... ఆ సంక్రాంతి సందడి తర్వాత మనముదుకు వచ్చిన అచ్చమైన, స్వచ్ఛమైన  ప్రేమ కథా చిత్రం "ప్రేమదేశం". ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా చూసిన నాకు ఈ సినిమా ఓక సర్ప్రైజ్ అనే చెప్పాలి. 
సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.
శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వంలో వస్తున్న  ఈ చిత్రాన్ని యువ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు. రఘు కళ్యాణ్ రెడ్డి, రాములు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహారిస్తున్న ఈ “ప్రేమదేశం” చిత్రంలోని పాటలకు మరియు టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత మైన రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 3 న గ్రాండ్ గా థియేటర్స్ లలో ప్రేక్షకులను మెప్పించడనికి  వచ్చిన "ప్రేమదేశం" సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

 కథ
ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ.ఈ మధ్యకాలంలో ఇలాంటి పాత్రలు చూడడానికి కరువయ్యాయి..అని చెప్పాలి.ఒకే కాలేజ్ లో చదువుకుంటున్న అర్జున్ (త్రిగున్),ఆద్య (మేఘా ఆకాష్) లకు ఒకరంటే ఒకరరికి ఇష్టం ఉన్నా  ఎప్పుడూ వారి ప్రేమను ను ఎక్స్ ప్రెస్ చేసుకోరు.చివరికి  వారిద్దరూ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14 న ఒక ప్లేస్ దగ్గర కలుసుకొని లవ్  ప్రపోజ్  చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆ ప్లేస్ పేరే " ప్రేమ దేశం".అయితే వారు అనుకున్న రోజు రావడంతో  ఇద్దరు లవ్  ప్రపోజ్ చేసుకోవ డానికి వస్తున్న వీరికి అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంది. మరోవైపు రిషి (అజయ్ కతుర్వాల్) అనే అబ్బాయి గత మూడు సంవత్సరాలనుండి మాయ అనే అమ్మాయి వెంట తిరుగుతూ మాయ ప్రేమను పొందాలని ఎంతో ప్రయత్నిస్తూ ఇంప్రెస్స్ చేస్తుంటాడు. చివరకు రిషి సిన్సియారిటీ నచ్చి రిషి ప్రేమకు మాయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిషి ఆనందానికి హద్దులు లేకుండా  పోతుంది. దాంతో రిషి , మాయల పెళ్లి  కూడా ఫిక్స్ అవుతుంది.

ఇంకోవైపు పెళ్లి పెళ్లి అని తిరుగుతూ పెళ్లిచేసుకోవాలనే అడిక్షన్ ఉన్న శివకు అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయికి శివ నచ్చడు. శివను ఇష్టపడి పెళ్లి చేసుకువాడానికి ముందుకు వచ్చిన అమ్మాయి శివకు నచ్చదు.  ఇలా సాగుతున్న క్రమంలో అనూహ్యంగా  మాయతో  శివ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంతో ఇష్టంగా ప్రేమించిన రిషి (అజయ్)తో తాళి కట్టించుకోవాల్సిన మాయ శివను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్దపడింది. అర్జున్, ఆద్య ల యాక్సిడెంట్ కు శివ, రిషి , మాయల మధ్య  ఉన్న లింకేంటి? ఈ రెండు స్టోరీస్ ఒకే దగ్గర కలవడానికి కారణమేంటి ? చివరకు  అర్జున్, ఆద్య లు ఒకటయ్యారా లేదా..? అనేది తెలుసుకోవాలంటే  తప్పకుండా "ప్రేమదేశం" సినిమా చుడాల్సిందే... 


నటీ నటుల పనితీరు 
త్రిగున్ చలాకీ తనం, మేఘా ఆకాష్ క్యూట్‌నెస్ తో వీరిద్దరూ తమ నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి సినిమాను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లారు అనిచెప్పవచ్చు. అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్  మధుబాల తన నటనతో తో అదరగొట్టింది. త్రిగున్ కు తల్లిగా నటించి  ఆ పాత్రలో ఒదిగిపోయింది. కాలేజీ ఎపిసోడ్స్ లో కూడా మధుబాల అల్లరితో  పాటు అద్భుతంగా నటించింది. అజయ్,శివ, మాయల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కళ్ళు చమర్చేలా చేసాయి.మాయ ఫాదర్ గా తనికెళ్ల భరణి చాలా చక్కగా నటించారు. ఇందులో శివ  ఎక్స్ట్రార్డినరీగా నటించాడు.రిషిగా  నటించిన అజయ్ చాలా జోవియల్ పాత్రలో నటించి మెప్పించాడు.. బేబీ సినిమాలో చేసిన వైష్ణవి చైతన్య మాయ చెల్లి క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. ఇంకా ఇందులో  నటించిన  వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
సీతా రామం తర్వాత మన కుటుంబం కుటుంబాన్ని తీసుకువెళ్లి హాయిగా చూడగలిగే సినిమా "ప్రేమదేశం".ఫస్ట్ హాఫ్ లో యూత్ ని కాలేజీ డేస్ లోకి తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో అధే యూత్ ని లవ్ మ్యారేజ్-ఆరెంజ్డ్ మ్యారేజ్డ్-వన్ సైడ్ లవ్ లోని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించాడు. ఇందులో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని కుల్లి కామెడీ గాని లేకుండా నీట్ అండ్ క్లీన్ సినిమా ని తెలుగు ప్రేక్షకులు కి అందించడంలో దర్శకుడు శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ సజాద్ కక్కు ఇచ్చిన విజువల్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఇదే అని చెప్పుకోవచ్చు. పదములే లేవు పిల్ల పాట, తెలవారేనేమో స్వామి వంటి  పాటలు థియేటర్లో ప్రేక్షకులను కనువిందు చేశాయి.కిరణ్ తుంపెర ఇచ్చిన ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ, రియల్ సతీష్, డ్రాగన్ ప్రకాష్ ల  ఫైట్స్ బాగున్నాయి.సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అప్పటి “ప్రేమదేశం” టైటిల్ తో వచ్చిన ఈ “ప్రేమదేశం” సినిమాను క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా నిర్మించిన నిర్మాతలు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ అయినా..ఈ సినిమా కొరకు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. కళ్లకి జిగేల్ జిగేల్ మంచిపించే రంగులు కాకుండా సినిమా మొదలయినప్పటి నుండి కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా సాగిపోతుంది.దర్శకుడు శ్రీకాంత్ గారు హీరో అర్జున్, వాళ్ల అమ్మ మధుభాల మధ్య రాసుకున్న సన్నివేశాలు సరదాగా సాగిపోయాయి.ఈ సినిమా చూస్తుంటే "అమ్మా నాన్న తమిళ అమ్మాయి" సినిమా గుర్తుచేసేలా ఉంటుంది.నిజం చెప్పాలంటే సెకండాఫ్ చూస్తున్నంత సేపు ఫస్ట్ హాఫ్ గుర్తుకురాదు. అక్కడక్కడా ఎక్కడో తెలిసిన కథలా అనిపించినా ఈ పాత్రలు మనకి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల, మన ఆలోచనలు ఎక్కడికి ఎల్లకుండా చేస్తాయి.సెకండాఫ్ ఆద్యంతం ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంది. క్లైమాక్స్ సింపుల్ గా ముగించినా...బి.సి... ప్రేక్షకుడి పెదవిమీద ప్రశాంతమైన నవ్వు తీసుకురావడంతో పాటు రెండు కధలని ఒక సంఘటనతో కలిపి విధానం బావుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com