మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి కృషి: బహ్రెయిన్
- February 03, 2023
బహ్రెయిన్: మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి బహ్రెయిన్ కృషి చేస్తుందని షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ అన్నారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ విజన్ నుండి ప్రేరణ పొందినట్లు అల్ సలేహ్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని పెంపొందించడానికి రాజు దార్శనికతలకు హెచ్ఎం మద్దతునిస్తూ, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఏటా ఫిబ్రవరి 4న జరుపుకునే అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా అల్ సలేహ్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య ప్రేమ, ఆప్యాయత, సోదరభావాన్ని వ్యాప్తి చేయడానికి, విభిన్న సంస్కృతులు, మతాలు, నమ్మకాల మధ్య నిర్మాణాత్మక సంభాషణలను ప్రోత్సహించడానికి బహ్రెయిన్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అల్ సలేహ్ పేర్కొన్నారు. బహ్రెయిన్ రాజ్యం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ చేసిన సంయుక్త తీర్మానం ద్వారా గొప్ప సాంస్కృతిక, మతపరమైన సహనాన్ని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







