యూఏఈ విజిట్ వీసా: గడువు దాటిన పర్యాటకులపై పరారీ కేసులు!

- February 03, 2023 , by Maagulf
యూఏఈ విజిట్ వీసా: గడువు దాటిన పర్యాటకులపై పరారీ కేసులు!

యూఏఈ: యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు తమ విజిట్ వీసాల గడువు దాటిన పర్యాటకులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వారిపై పరారీ కేసులను నమోదు చేయించేందుకు కూడా వెనుకాడటం లేదు. కొంతమంది ఏజెంట్లు తమ వీసాల గడువు ముగిసిన తర్వాత 'ఐదు రోజుల కంటే ఎక్కువ' నిష్క్రమించకపోతే, ఓవర్‌స్టేయర్‌లను 'బ్లాక్‌లిస్ట్' చేసి యూఏఈ, ఏదైనా GCC దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా పర్యాటకులకు ట్రావెల్ ఏజెన్సీల నుండి వార్నింగ్ అలెర్ట్ లు వస్తున్నాయి. రూహ్ టూరిజం ఆపరేషనల్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ మాట్లాడుతూ..30 రోజులు లేదా 60 రోజుల విజిట్ వీసాపై యూఏఈకి వచ్చే పర్యాటకులు తమ స్పాన్సర్‌షిప్ కింద ఉంటారని తెలిపారు. పర్యాటకుల వీసా కాలపరిమితిని మించిపోతే తాము ఇబ్బందుల్లో పడి నష్టపోతాం.. అందుకే తమ భద్రత కోసం గడువు ముగిసిన పర్యాటకులను పరారీలో ఉన్నట్లుగా నివేదిక అందజేస్తున్నామని తెలిపారు. ఒక సందర్శకుడు ఎక్కువ కాలం గడిపినట్లయితే తమపై కూడా జరిమానా పడుతుందన్నారు. ఇక ఎక్కువ కాలం గడిపిన వ్యక్తి జరిమానాలతో పాటు దేశం నుండి నిష్క్రమించడానికి ఔట్‌పాస్‌ను కూడా పొందాల్సి ఉంటుందని, అది తమకు పెద్ద భారంగా మారుతుందని వర్గీస్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com