ప్రెగ్నెంట్ లేడీస్ ఆ లిక్విడ్ తీసుకోవడం వల్ల నష్టాలేమైనా వున్నాయా.?

- February 03, 2023 , by Maagulf
ప్రెగ్నెంట్ లేడీస్ ఆ లిక్విడ్ తీసుకోవడం వల్ల నష్టాలేమైనా వున్నాయా.?

ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు దేవుడిచ్చిన ఓ వరం. ఈ టైమ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా వుండాల్సి వుంటుంది. కొన్ని తినకూడనివి, కొన్ని ఖచ్చితంగా తినాల్సిన ఆహార పదార్ధాలుంటాయ్.
అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో వేవిళ్లు.. అదే వాంతులు ఎక్కువగా అవుతుంటాయ్ కొంతమంది గర్భిణుల్లో. ఈ టైమ్‌లో బాగా నీరసించిపోతుంటారు. ఏదీ తినబుద్ది కాదు.. దాంతో బాగా వీక్‌గా కనిపిస్తుంటారు. ఈ వీక్‌నెస్ కారణంగా కడుపులోని బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయ్.

సహజంగా వాంతులు ఎక్కువగా అవుతుంటే, ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తుంటారు. అయితే, ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఓఆర్ఎస్ ద్రావణాన్ని కాస్త తక్కువగానే తాగించాలట. దాని ప్లేస్‌లో నిమ్మరసం, నారింజ రసం ఇస్తే మంచిదని గైనిక్ నిపుణులు చెబుతున్నారు.

అలాగే, రాగి పిండితో చేసిన జావతో పాటూ, నిమ్మకాయ కలిపిన మజ్జిగ వంటివి ఇస్తే, నీరసం నుంచి తొందరగా తేరుకునే అవకాశాలుంటాయ. వాంతులు ఎక్కువగా అవుతున్నప్పటికీ, నోటికి ఏదీ సహించనప్పటికీ తినాల్సిన ఆహారాన్ని ఏదో ఒక రకంగా తీసుకోవాలనీ వ్యైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పండ్లూ, పండ్ల రసాలను తరచుగా తీసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com