జీతాలు చెల్లించని కంపెనీపై కార్మిక శాఖ చర్యలు
- February 04, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అల్ దహిరా గవర్నరేట్‌లో గత కొద్ది నెలలుగా తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందుకు ఒక ప్రైవేట్ రంగ సంస్థపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అల్దాహిరా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, అనేక నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంపై కార్మిక చట్టం ఆర్టికల్ నంబర్ 53, 51 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ప్రైవేట్ రంగ కంపెనీపై చర్యలు తీసుకోవాలని న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్లు ప్రకటించింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ నెం. (51)లో పేర్కొన్న తేదీలలోపు తమ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు, కంపెనీలకు పిలుపునిచ్చింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ No51 కింద నెలవారీ వేతనాలపై నియమించబడిన కార్మికులకు వారి వేతనాలను కనీసం ప్రతి నెలా ఒకసారి చెల్లించాలి.
తాజా వార్తలు
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!







