ప్రవాసుడికి అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో జాక్‌పాట్

- February 04, 2023 , by Maagulf
ప్రవాసుడికి అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో జాక్‌పాట్

అబుధాబి: ఖతార్‌లో ఉండే ఓ ప్రవాసుడికి తాజాగా నిర్వహించిన అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో జాక్‌పాట్ తగిలింది.దాంతో అతడు కలలో కూడా ఊహించనంత నగదు గెలుచుకున్నాడు. నేపాల్‌కు చెందిన ప్రవాసుడు రంజిత్ కుమార్ పాల్‌ గత నెల 16వ తేదీన 248 సిరీస్‌లో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కే ఈ జాక్‌పాట్ తగిలింది.ఖతార్ రాజధాని దోహాలో ఉండే రంజిత్ ఆన్‌లైన్‌లో కొన్న టికెట్ నం.232936 అతనికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.ర్యాఫిల్ డ్రాలో విజేతగా నిలిచిన అతడు ఏకంగా 23 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.

దోహాలో గత ఏడేళ్లుగా నివాసం ఉంటున్న రంజిత్ 15 నెలల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నాడు.మరో 20 మంది స్నేహితులతో కలిసి అతడు ఇలా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన రంజిత్ స్థానికంగా ఉండే ఓ మనీ ఎక్స్ంఛేజ్ కంపెనీలో పని చేస్తున్నాడు.'ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు.ఇది మా జీవితాన్నే మార్చివేసే అద్భుత సంఘటన.ఈ నగదుతో స్వదేశానికి వెళ్లి పర్మినెంట్‌గా అక్కడే సెటిల్ అవుతా' అని రంజిత్ చెప్పాడు. ఇక ఇదే డ్రాలో భారత ప్రవాసులు కూడా పలు విలువైన బహుమతులు, భారీ మొత్తంలో క్యాష్ గెలుచుకున్నారు. విజేష్ విశ్వనాథన్ అనే భారతీయుడు 1మిలియన్ దిర్హాములు గెలుచుకోగా.. షిబూ మాథ్యువ్ అనే వ్యక్తి 1లక్ష దిర్హాములు, అజిత్ రామచంద్ర కైమల్ 50వేల దిర్హాములు గెలుచుకున్నారు. అలాగే సుమన్ ముత్తయ్య నడార్ రాఘవన్ అనే భారత ప్రవాసుడు న్యూ బ్రాండ్ రేంజ్ రోవర్ విన్ అయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com