ఈ వారాంతంలో యూఏఈలో అరుదైన ఆకుపచ్చ తోకచుక్క.. ఇలా చూడవచ్చు

- February 04, 2023 , by Maagulf
ఈ వారాంతంలో యూఏఈలో అరుదైన ఆకుపచ్చ తోకచుక్క.. ఇలా చూడవచ్చు

యూఏఈ: ప్రతి 50 వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమిపై కనిపించే అతి అరుదైన ఆకుపచ్చ తోకచుక్క యూఏఈలో ఈ వారాంతంలో కనువిందు చేయనున్నది. C/2022 E3 (ZTF) అనే పేరుగల ఆకుపచ్చ రంగు తోకచుక్క ఫిబ్రవరి 1న భూమికి సమీపంలోకి వచ్చింది. ఇది ఫిబ్రవరి 5 వరకు ఆకాశంలో కనిపిస్తుందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (IAC) తెలిపింది. జనవరి 14 తెల్లవారుజామున అబుధాబి ఎడారిలో దీన్ని స్పష్టంగా చూసినట్లు ఐఏసీ పేర్కొంది. కామెట్ ఇప్పుడు భూమికి 26 మిలియన్ మైళ్ల (42 మిలియన్ కిలోమీటర్లు) దూరంలోకి వచ్చింది. ఇది గంటకు 207,000కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర అర్ధగోళంలో ఉన్న దేశాలలో గత కొన్ని వారాలుగా ఈ కామెట్ కనిపిస్తుంది. ఈ వారాంతంలో UAE ఆకాశంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని దుబాయ్ ఖగోళ శాస్త్ర గ్రూప్ (DAG) CEO హసన్ అల్ హరిరి తెలిపారు. అయితే, కామెట్ ప్రకాశాన్ని అంచనా వేయడం కష్టం అని వివరించారు. కానీ అది కంటితో చూడగలిగేంత ప్రకాశవంతం కాకపోయినా, ఫిబ్రవరి ప్రారంభంలో బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోప్‌లతో వీక్షించవచ్చ గుడ్ న్యూస్ తెలిపారు. దుబాయ్‌లోని అల్ ఖుద్రా ఎడారిలో ఫిభ్రవరి 4న సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకు ప్రత్యేక టిక్కెట్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామెట్, చంద్రుడు, మార్స్, బృహస్పతి, లోతైన ఆకాశ వస్తువులు టెలిస్కోప్ పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ సెషన్‌లు, స్కై మ్యాపింగ్, మరిన్నింటి గురించి చర్చలు జరుగుతాయని తెలిపారు.

నివాసితులు ఇంటి నుండి చూడవచ్చా?

తమ ఇళ్ల నుండి ఖగోళ శరీరాన్ని పరిశీలించాలనుకునే వారు ప్రత్యేక పరికరాలతో చూడవచ్చు. కామెట్‌ను పరిశీలించడానికి బైనాక్యులర్లు ఉత్తమ సాధనాలు అని అల్ హరిరి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com