IGA బహ్రెయిన్ సేవలు పునరుద్ధరణ

- February 04, 2023 , by Maagulf
IGA బహ్రెయిన్ సేవలు పునరుద్ధరణ

బహ్రెయిన్: ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ తన సేవలన్నింటినీ నేషనల్ పోర్టల్(http://bahrain.bh) ద్వారా పునరుద్ధరించినట్లు ప్రకటించింది. గురువారం అథారిటీ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో తమ సేవలు తిరిగి ప్రారంభమైనట్లు.. bahrain.bh/app లేదా http://bahrain.bh ద్వారా తమ eServiceలను పొందవచ్చని అథారిటీ తన ఇన్ స్టా గ్రామ్ పోస్టులో తెలిపింది. ఐజీఏ సర్వీసుల నిలుపుదల కారణంగా జరిగిన అసౌకర్యానికి అథారిటీ క్షమాపణలు చెప్పింది.  ఇప్పుడు నేషనల్ పోర్టల్ (http://bahrain.bh) ద్వారా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఇ-గవర్నమెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ అఫైర్స్ అండ్ వక్ఫ్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ కస్టమ్స్ అఫైర్స్ సర్వీసెస్ లతోపాటు మరికొన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com