యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన భారత ప్రధాని మోదీ
- February 04, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని మెరుగుపరచడానికి, వారి పరిధిని విస్తరించే మార్గాల గురించి చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పరస్పరం ఆందోళన కలిగించే అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. సంబంధిత పరిణామాలను సమీక్షించారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, మోడీ తమ దేశాలు తమ అభివృద్ధి లక్ష్యాలను మరింత సాధించడానికి వివిధ రంగాలలో తమ భాగస్వామ్యాన్ని, సహకారాన్ని పెంచుకుంటూనే ఉండాలని నిర్ణయించినట్లు ఇరుదేశాల విదేశాంగ శాఖలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







