అఖిల్ కోసం చిరంజీవి వెనక్కి తగ్గుతారా.?
- February 05, 2023మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా వున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపిస్తోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు స్లాట్ బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అదే స్లాట్‌కి అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్.. అంటూ అఖిల్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అలాంటప్పుడు మెగాస్టార్ చిరంజీవితో బరిలోకి దిగితే నెగ్గడం చాలా చాలా కష్టం.
కనుక, చిరంజీవిని తన సినిమా పోస్ట్ పోన్ చేసుకోమని నాగార్జున కోరుతున్నాడట. అసలే ‘భోళా శంకరుడు’ కదా.. అఖిల్ కోసం వెనక్కి తగ్గాలనే అనుకుంటున్నాడట. బహుశా మేలో ‘భోళా శంకర్’ రిలీజ్ వుండొచ్చని అంటున్నారు.
అయితే, ఇదంతా జస్ట్ ప్రచారం మాత్రమే. ఈ ప్రచారం ఎంత నిజమో తెలియాలంటే, అధికారికంగా ప్రకటన రావల్సి వుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..