ఆరోగ్య బీమా కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- February 06, 2023
యూఏఈ: ఆరోగ్య బీమా మార్గదర్శకాలను పాటించని కారణంగా ఐరిస్ హెల్త్ సర్వీసెస్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (సిబియుఎఇ) తెలిపింది. ఆరోగ్య బీమా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లకు లైసెన్సింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా లైసెన్స్ రద్దు చేసినట్లు వెల్లడించింది. ఐరిస్ హెల్త్ సర్వీసెస్ అనేది కంపెనీ వైద్య ప్రయోజనం, క్లెయిమ్‌ల పరిపాలన సేవలను అందించే థార్డ్ పార్టీ పరిపాలన సేవా సంస్థ. అన్ని కంపెనీలు స్థానిక చట్టాలకు కట్టుబడి ఉండేలా సెంట్రల్ బ్యాంక్ పర్యవేక్షిస్తుంది. జూన్ 2022లో రెగ్యులేటరీ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైనందుకు రెండు బీమా కంపెనీలపై పరిపాలనాపరమైన నిషేధాన్ని విధించింది. కొత్త కస్టమర్లకు ఒక సంవత్సరం పాటు అదనపు బీమా పాలసీలను జారీ చేయకుండా ఒక సంస్థపై ఆంక్షలు విధించింది. గత ఏడాది డిసెంబర్లో మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి బీమా రంగానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. బీమా రంగంలో పనిచేస్తున్న కంపెనీలు - బీమా సంస్థలు, రీఇన్స్యూరర్లు, ఏజెంట్లు, బ్రోకర్లతో సహా - కొత్త నిబంధనలను రూపొందించారు. భీమా పరిశ్రమ, యూఏఈ ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు అన్ని బీమా కంపెనీలు, బీమా కంపెనీలకు సంబంధించిన వృత్తులు రెగ్యులేటర్ ఆమోదించిన యూఏఈ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండేలా చూస్తామని సెంట్రల్ బ్యాంక్ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!