భారతీయ పాఠశాల విద్యార్థిని ఫిదా.. తొలి నవల విడుదల

- February 06, 2023 , by Maagulf
భారతీయ పాఠశాల విద్యార్థిని ఫిదా.. తొలి నవల విడుదల

కువైట్: ఇండియన్ ఎడ్యుకేషన్ స్కూల్ (భవన్స్ కువైట్)కు చెందిన 10వ తరగతి భారతీయ విద్యార్థిని  ఫిదా ఆన్సి తన మొదటి నవలను "ఎ కన్వర్జెన్స్ ఆఫ్ ఫేట్స్" పేరుతో విడుదల చేసింది. రేండేళ్లపాటు రాసిన ఈ నవలను కేరళకు చెందిన ఇ-గ్రంధ అనే ప్రచురణకర్త ప్రచురించారని ఫిదా తెలిపింది. చిన్నప్పటి నుంచి చదవడం అంటే చాలా ఇష్టమన్న ఫిదా.. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, మోటివేషనల్ పుస్తకాలు చదవడం అంటే చాలా అసక్తి అన్నారు. "ఎ కన్వర్జెన్స్ ఆఫ్ ఫేట్స్" అనే నవల మూడు ప్రధాన పాత్రల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ఒక ఫాంటసీ స్టోరీ అని తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ నవల జూన్‌లో భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది. ఫిదా తండ్రి మిస్టర్ బషీర్ ఆన్సి బెహబెహానీ మోటార్స్‌లో పని చేస్తుండగా.. ఆమె తల్లి షఫ్నా ఆన్సి కువైట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉపాధ్యాయురాలు. ఆమెకు ఉన్న ఇద్దరు తోబుట్టువులు.. కువైట్‌లో చదువుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com