కువైట్ ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్.. కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులు

- February 08, 2023 , by Maagulf
కువైట్ ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్.. కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులు

కువైట్: ప్రవాస భారతీయుల నుంచి కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భారత రాయబారి భారతీయ పౌరులకు  సబంధించిన కాన్సులర్ సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఓపెన్ హౌజ్ జరగనుంది. భారతీయ పౌరులు ఉదయం 9:30 గంటల నుండి రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓపెన్ హౌస్ సమయంలో భారతీయ పౌరులకు ఏవైనా కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి రాయబారి, కాన్సులర్ అధికారులు అందుబాటులో ఉంటారని ఇండియన్ ఎంబసీ కార్యాలయం తన ప్రకటనలో తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com