ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
- February 08, 2023
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో బడ్జెట్ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు. సుమారు రూ.లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యూఎనర్జీ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. 2 విడతల్లో మొత్తంగా రూ.1.10 లక్షల కోట్లతో న్యూఎనర్జీ పార్క్.. 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం (AP Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా… 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
అలాగే వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బందరు పోర్టు కు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. అటు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్… యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.
కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!