ధోఫర్‌లో 35,000 కంటే ఎక్కువ ఆక్రమణ పక్షుల తొలగింపు
- February 09, 2023
మస్కట్: దోఫార్‌లో ఆక్రమణ పక్షులను ఎదుర్కోవడానికి జాతీయ ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుండి సుమారు 35,000 ఆక్రమణ పక్షులను తొలగించినట్లు ఎన్విరాన్‌మెంట్ అథారిటీ తెలిపింది. వీటిలో 9,368 భారతీయ కాకులు, 25,786 మైనాలు ఉన్నాయని పేర్కొంది. ఒమన్ సుల్తానేట్‌లో ఆక్రమణ పక్షులు పెరిగినందున, ఎన్విరాన్‌మెంట్ అథారిటీ (EA) డిసెంబర్ 13, 2022న జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పక్షుల వ్యాప్తిని తనిఖీ చేయడం, జాతీయ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంపై అధ్యయనం చేయడానికి అథారిటీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ పక్షులు పంటలను నాశనం చేయడం, తేనెటీగలను తినడం, వ్యాధులు, పరాన్నజీవులు, ఈగలను మానవులకు, జంతువులకు ప్రసారం చేయడం ద్వారా విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు తెలిపారు. ఒమన్ 1982లో మస్కట్ గవర్నరేట్‌లో మొదటి మైనాను గుర్తించింది. మైనాస్ వాటి ఉనికి ప్రాంతాలలో ఆహార గొలుసును ప్రభావితం చేస్తాయని, ఈ పక్షులు ఇతర పక్షుల గూళ్ళపై దాడి చేసి పిల్లలను చంపుతాయని అథారిటీ నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







