‘అమిగోస్’‌తో నందమూరి హీరో హిట్టు పట్టేలాగే వున్నాడే.!

- February 09, 2023 , by Maagulf
‘అమిగోస్’‌తో నందమూరి హీరో హిట్టు పట్టేలాగే వున్నాడే.!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ జోరు పెంచాడు. గతేడాది ‘బింబిసార’తో బాక్సాఫీస్ హిట్ కొట్టేశాడు. దారుణమైన గడ్డు పరిస్థితిలో ‘బింబిసార’ హిట్ కేవలం కళ్యాణ్ రామ్ క్రెడిట్‌గానే కాదు, ఇండస్ర్టీ హిట్‌గా బాగా కలిసొచ్చింది. 
తక్కువ గ్యాప్‌లోనే మళ్లీ వచ్చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన నటించిన ‘అమిగోస్’ సినిమా రేపు అనగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ఈ సినిమాకి భారీగా ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది ‘బింబిసార’ పుణ్యమా అని. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా రిలీజ్ చేయడంతో సినిమాపై ఒకింత పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.
అదీ ఓ ఇంట్రెస్టింగ్ పాయింటే ‘అమిగోస్’‌కి. యాషికా రంగనాధ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీస్ ఈ సినిమాని నిర్మించడం మరో అస్సెట్. సో, కళ్యాణ్ ‌రామ్ లక్కు మామూలుగా లేదనిపిస్తోంది. చూడాలి మరి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com